ఏపీ సచివాలయంలో కరోనా కలకలం.. మరో ఇద్దరు ఉద్యోగులు మృతి
ఆంధప్రదేశ్ సచివాలయంలో కరోనాతో మరో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. పంచాయతీరాజ్ సెక్షన్ ఆఫీసర్ శాంతి కుమారి కరోనాతో మృతిచెందగా, హోంశాఖ రికార్డు అసిస్టెంట్ ఏఎస్ఎన్ మూర్తి కొవిడ్‌తో మరణించారు. ఈ పరిణామంతో సచివాలయ ఉద్యోగులు భయాందోళనకుగు గురవుతున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా మరోసారి వర్క్ ఫ్రం హోం ఇవ్వాల్సిందిగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వివిధ విభాగాల్లో ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో సచివాలయంలో పని చేసేవారికి ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. కొవిడ్ భయంతో ఉన్నతాధికారులు విజయవాడ, గుంటూరులోని హెచ్‌వోడీ కార్యాలయాలు నుంచే విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.













