ఏపీ సచివాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
ఆంధప్రదేశ్ సచివాలయానికి సంక్రాంతి ముందే వచ్చింది. సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. హరిదాసులు, గంగిరెద్దులు, కొమ్మదాసరులు, కత్తి, కర్రసాము గారడీలు, డబ్బుల చప్పుల్లు.. అన్నిటికి మించి రంగవల్లులను సచివాలయ ఉద్యోగులు తీర్చిదిద్దారు. నిత్యం అనేక ఒత్తిడిలు మధ్య పనిచేసే తమకు ఈ సంబరాలు సంతోషాన్ని అందించాయని అన్నారు. సచివాలయంలో గ్రామీణ వాతావణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సంక్రాంతి పండుగ ఎలా జరుగుతుందో.. ప్రతి పల్లెల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చిందన్నారు. మన సంస్క•తి సంప్రదాయాలను అందరికి తెలిసేలా చేయాలని చెప్పిందని అన్నారు. దీంతో సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.













