ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విడుదల చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని ఎస్ఈసీ సృష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నట్లు రమేశ్ కుమార్ సృష్టం చేశారు.
తొలి విడత :
మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికతో ముగుస్తుంది. జనవరి 23న నోటిఫికేషన్ జారీ. 25న అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ. 27న నామినేషన్ ల దాఖలుకు తుది గడువు. 28 నామినేషన్ల పరిశీలన. 29 నామినేషన్ లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన. 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం. 31న నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు (మధ్యాహ్నం 3 గంటలకు వరకు) అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల. ఫిబ్రవరి 5 పోలింగ్ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 మధ్య పోలింగ్) పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మాధ్యహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడుత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
రెండో విడత పోలింగ్ :
జవనరి 29 నుంచి అభ్యర్థుల నామినేషన్ ల స్వీకరణ. 31న నామినేషన్ ల దాఖలు తుది గడువు. ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన. 2ప నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన. 3న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం. 4న నామినేషన్లపై ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు) అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల. ఫిబ్రవరి 9న పోలింగ్ తేదీ. పోలింగ్ పక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయడంటో రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
మూడో విడత :
ఫిబ్రవరి 2 నుంచి అభ్యర్థుల నామినేష్ల స్వీకరణ. 4న నామినేషన్ ల దాఖలు తుది గడువు. 5న నామినేషన్ల పరిశీలన. 6న నామినేషన్ లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన. 7న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం. 8న నామినేష్ల ఉపసంహరణకు తుది గడువు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల. 13 పోలింగ్ తేదీ. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మూడో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
నాలుగో విడత :
ఫిబ్రవరి 6 నుంచి అభ్యర్థుల నామినేషన్ ల స్వీకరణ. 8న నామినేషణ్ల దాఖలు తుది గడువు. 9న నామినేషన్ ల పరిశీలన. 10న నామినేషన్ లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన. 11న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం. 12న నామినేషన్ ల ఉపసంహరణకు తుది గడువు అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల. 17న పోలింగ్. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికకు పూర్తి చేయటంతో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.













