గవర్నర్ ను కలిసిన ఎస్ఈసీ నీలం సాహ్ని
ఆంధప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఎస్ఈసీ నీలం సాహ్ని కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రకియపై గవర్నర్‌తో చర్చించారు. కాగా, ఎస్ఈసీని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల పక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు. ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్ పక్రియను వేగవంతం చేయాల్సి ఉందని సీఎస్ తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలపై చర్చించారు. ఎన్నికల ప్రకియపై ఎస్ఈసీ నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది.













