ఏపీలో భారీగా తగ్గిన కేసులు…

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 83,461 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 7,943 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 16,93,085 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనాతో 98 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 10,930 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 1,53,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 15,28,360 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో 19,845 మంది రికవరీ అయ్యారు.
గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 12 మంది కరోనాతో మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో 10, అనంతపురం జిల్లాలో 9 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. కృష్ణ, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కడప జిల్లాలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు.