ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 86,878 మందికి పరీక్షలు నిర్వహించగా, 20,345 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‍లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 13,22,934కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 14,502 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,75,14,937 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,95,102 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 707 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ 108 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 18 మంది, విశాఖపట్నంలో 12, తూర్పుగోదావరి, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో 10 మంది, ప్రకాశంలో 9, నెల్లూరు 8, కృష్ణా 7, శ్రీకాకుళం 6, అనంతపురం, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడప జిల్లాలో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 8,899కి చేరింది.