ఏపీలో కొత్తగా 19,981 కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 90,609 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 19,981 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,62,060 మందికి పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. వీరిలో 13,41,355 మంది కోలుకోగా 10,022 మంది మరణించారు. ప్రస్తుతం 2,10,683 క్రియాశీల కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణాల సం•్య 10 వేల మార్కును దాటేసింది. ఒక్కరోజే 118 మరణాలు నమోదు కావడంతో మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 10,022కి పెరిగింది. మరనాల్లో పశ్చిమగోదావరి అత్యధికంగా 15 మంది, చిత్తూరులో 14, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో 11 మంది, గుంటూరు 10 మంది, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 8 మంది, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఏడుగురు చొప్పున మృతి చెందారు. కడప జిల్లాల్లో ఇద్దరు మృతి చెందారు.