నైపుణ్యాభివృద్ధిలో ఏపీ బంగారం
నైపుణ్యాభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీలో అసోచామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజ్‌కుమార్ సింగ్ చేతుల మీదుగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ తరపున టెక్నికల్ సీజీఎం రవికుమార్ గుజ్జుల, సీనియర్ మేనేజర్ ధేనుకా నాయక్ ఈ అవార్డును అందుకున్నారు. కాగా, పబ్లిక్ అండ్ టేకింగ్ సంస్థల విభాగంలో భారీస్థాయిలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నందుకు విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ సంస్థ ప్రథమ స్థానం కైవసం చేసుకుంది.













