చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్‌కు మరోమారు పోలీసు నోటీసులు
వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ పోలీసుల విచారణకు మంగళవారం డుమ్మా కొట్టడంతో ఆయనకు మరోమారు పోలీసు నోటీసులు అందాయి. బుధవారం నాడు విచారణకు హాజరు కావాలని జోగి రమేశ్‌ను పోలీసులు ఆదేశించారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో కుమారుడి అరెస్ట్‌ను సాకుగా చూపి గతంలోనూ ఆయన పోలీసుల విచారణకు హాజరుకాలేదు. శుక్రవారం మంగళగిరి పోలీసుల ఎదుట జోగి రమేశ్ హాజరయ్యారు. గంటపాటు ఆయన్ను విచారించిన పోలీసులు.. మంగళవారం నాడు మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉందని ఆదేశించారు. ఈ విచారణకు రమేశ్ గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆయన తరపు లాయర్లు పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పోలీసులు తాజగా మరోమారు నోటీసులు జారీచేశారు.













