మాజీ మంత్రి జోగి రమేశ్‌కు నోటీసులు
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని జోగి రమేశ్‌కు సూచిచారు. మరోవైపు జోగి రమేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై విచారణను హైకోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది.













