అప్పుడు స్వాగతించిన జగన్…ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో
మూడు రాజధానులకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. ఈ సమస్యకు చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అమరావతిని స్వాగతించిన జగన్, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి సాయం పొందడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ శైలజానాథ్ కొత్త అర్థం చెప్పారు.













