దుబాయ్ ఎక్స్ పోలో ఏపీ పెవిలియన్ : మంత్రి గౌతమ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్ ఎక్స్‌పో`2020 వేదికను వినియోగించుకుంటోంది. దుబాయ్‌లో ఈ నెల 11వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగే పెట్టుబుడుల సదస్సులో ఏపీ పెవిలియన్ పేరిట ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లకు వివరించనుంది. ఏపీ పెవిలియన్‌ను రాష్ట్ర పరిశ్రమశాలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, తయారీ రంగం, పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, విద్య, వైద్య పర్యాటకం, వ్యవసాయం, ఆహారశుద్ధి వంటి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడిరచారు. పెలివియన్ ప్రారంభ కార్యక్రమంలో యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి తనిబిన్ అహ్మద్ ఆల్ జియౌది, ఇండియాలో సౌదీ అరేబియా అంబాసిడర్ అహ్మద్ అబ్దుల్ రెహమాన్ అల్బానా, యూఏఈలో భారత దౌత్యధికారి సంజయ్ సుధీర్, రాష్ట్ర విదేశీ పెట్టుబడుల సలహాదారు జుల్ఫీ రౌడ్జీ తదితరులు పాల్గొంటారు.