తక్షణమే నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి
ఆంధప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసేలా ఉందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఈసీ తీరుకు నిరసనగా ఎన్నికల పక్రియను బహిష్కరిస్తామని హెచ్చరించారు. తక్షణమే నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు లక్షల మంది ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలి ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గలేదని, ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వానిక్ని కోరామని చెప్పారు. 64 సంఘాలు కూడా అదే అంశాన్ని వెల్లడించాయని సృష్టం చేశారు. అత్యవసరంగా ఇప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధపదవుల్లో ఉన్న వారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.













