ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ?

ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి హఠాత్తుగా రిలీవ్ చేయడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. దీంతో కొత్త సీఎస్ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మరో ముడు నెలలు పొడిగించేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, ఆ లేఖకు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆదిత్యనాథ్ దాస్ కొనసాగింపు సందిగ్ధత నెలకొంది. ఆదిత్యనాథ్ దాస్‍కు పొడిగింపు లభించకపోతే నీరబ్ కుమార్‍కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు మొదట భావించారు. అయితే ఎవరి వ్యూహాలకు అందకుండా ప్రభుత్వం సమీర్ శర్మను సీఎస్‍గా నియామకం చేయనున్నట్లు సమాచారం.
కేంద్ర సర్వీసుల నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ రిలీవ్ అయ్యారు. రేపో మాపో ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు. సమీర్ శర్మను కేంద్ర సర్వీసుల నుంచి సిబ్బంది వ్యవహారాలశాఖ రిలీవ్ చేసింది. కేంద్రంలో కార్పొరేట్ వ్యవహరాల డైరెక్టర్‍గా జనరల్‍గా సమీర్ శర్మ పనిచేశారు. ఏపీలో పరిపాలనా వ్యవహారాల సంస్థలో కోచింగ్ ఇచ్చే అవకాశం ఉంది. నెలాఖరులో సీఎస్ ఆదిత్యనాథ్ రిటైర్ కానున్నారు.