Pawan Kalyan:పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు పలువురు మంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు (wishes) తెలియజేశారు. మంత్రులు అనిత (Anitha), అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, డీఎస్‌బీవీ స్వామి, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి తదిరులు ఆయనకు విషెస్ చెప్పారు. అసాధారణ ప్రతిభ, అంకితభావంతో సినీ ఇండస్ట్రీలో పవర్‌స్టార్‌గా ఎదిగారని కితాబిచ్చారు. ప్రజల అభిమానాన్ని చూరగొని నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములయ్యారన్నారు. పవన్ ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉప సభాపతి రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ సినిమా రంగంలో తన ప్రతిభతో కోట్ల మంది అభిమానులను అలరించారని, రాజకీయ రంగంలోనూ ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ధైర్యవంతుడు ఆయన అని అచ్చెన్నాయుడు (Atchannaidu) కొనియారు. పవన్ ఎప్పుడూ సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో ఉంటారని పేర్కొన్నారు.