Visakhapatnam: విశాఖ భాగస్వామ్య సదస్సుకు రండి

అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా విశాఖ (Visakhapatnam)లో నవంబరు 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రుల బృందం దక్షిణ కొరియా (South Korea) కు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులకు తెలిపింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, ఎల్‌ఎస్ గ్రూప్, షూఆల్స్, ఎస్‌కె హైనిక్స్ సంస్థల ప్రతినిధులతో బృందం సమావేశమైంది. విశాఖలో నిర్వహించనున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయా కంపెనీల ప్రతినిధులకు మంత్రులు నారాయణ(Narayana) , బీసీ జనార్దన్‌రెడ్డి (Janardhan Reddy) బృందం వివరించింది. సీనియర్ అధికారులు ఎంటీ కృష్ణబాబు, కాటమనేని భాస్కర్, ఈడీబీ అధికారులు మంత్రుల వెంట ఉన్నారు.