Anita: విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించనుండటం అదృష్టం : మంత్రి అనిత
భారత్లో సంప్రదాయంగా వస్తున్న వ్యవస్థ యోగా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anita) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా విశాఖ(Visakhapatnam) లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర (Yoga Andhra) లో మంత్రులు డీబీవీ స్వామి (DBV Swamy), అనిత పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో యోగాసనాలు వేశారు. అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. 11వ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించనుండటం అదృష్టం. రోజూ గంట ఆసనాలు వేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటాం. వచ్చే నెల 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ (Prime Minister Modi ) హాజరవుతారు అని తెలిపారు. ఆరోగ్యమే మనకు గొప్ప అస్తి అని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. అందరిలో ఆరోగ్య భద్రత పెరిగిందని, ప్రస్తుతం పాత తరం ఆహారపు అలవాట్ల వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.













