Amaravati : అమరావతి పున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
రాజధాని అమరావతి (Amaravati) పున ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులు (Ministers) తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేసిన త్యాగం మరువలేనిదని మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. రాజధాని పునప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు (Chandrababu) వారిని స్వయంగా ఆహ్వానించారని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రధాని మోదీ (Prime Minister Modi) అమరావతికి చేరుకుంటారని ఆయన తెలిపారు. అమరావతి పున ప్రారంభోత్సవం కోసం సభా ప్రాంగణం పూర్తయిందని మంత్రి పయ్యావల కేశవ్ (Payyawala Keshav) తెలిపారు. పార్కింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. రాజధాని కార్యక్రమం మనది అనే భావన అందరికీ వచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అధికారులతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) తెలిపారు.













