Minister Narayana : వైసీపీ ప్రభుత్వం మాపై కక్షతో.. అనేక పనులను : మంత్రి నారాయణ

వైసీపీ ప్రభుత్వం మాపై కక్షతో అనేక పనులు నిలిపివేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ (Narayana) అన్నారు. నెల్లూరు (Nellore ) లో పర్యటించిన ఆయన 15వ డివిజన్ రౌండ్ తూము వద్ద రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పనిచేయడమే సుపరిపాలన అన్నారు. నెల్లూరులో 6 వాటర్ ప్లాంట్ల (water plants) ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని తెలిపారు. జిల్లాలో మరికొన్ని బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైల్వే ట్రాక్ (railway track ) ల వద్ద అండర్‌పాస్ (underpass) బ్రిడ్జ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. డ్రైయిన్ల పనులు 10 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.