South Korea: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన

దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ (Narayana) , రోడ్డు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Janardhan Reddy) తో పాటు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు(Kannababu) పర్యటించారు. అమరావతితో పాటు సుస్థిర నగరాల నిర్మాణ అధ్యయనం, పెట్టుబడుల సాధనకై ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ) ఆధ్వర్యంలో దక్షిణకొరియాకు మంత్రుల బృందం వెళ్లింది. ఇందులో భాగంగా నామీ ద్వీపం సీఈఓ క్యోంగ్‌వూతో భేటీ అయ్యారు. దక్షిణ కొరియాలో సహజ సిద్ధమైన, సాంస్కృతిక, సాంప్రదాయక పర్యాటక ప్రదేశమైన నామీ ఐలాండ్ రాజధాని సియోల్‌లో అతి పెద్ద పర్యాటక ప్రాంతం. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లతో ఏడాది పొడవునా ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న తీరు, ద్వీపం అభివృద్ధికై తీసుకున్న చర్యలపై సీఈవో క్యోంగ్‌తో మంత్రి నారాయణ చర్చించారు. 4,60,000 చ.మీ.విస్తీర్ణంలో అందమైన చెట్లు, పూల మొక్కలతో విశేషంగా ఆకర్షిస్తున్న నామీ ద్వీప నమూనానే అమరావతి (Amaravati) ని బ్లూ గ్రీన్ సిటీగా రూపుదిద్దడంలో పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.