Narayana : స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు : మంత్రి నారాయణ
రాజధాని అమరావతి పై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ(Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ (Smart Industries) రావాలని తెలిపారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ (Flight connectivity) ఉండాలి. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు (Chandrababu) ఆలోచన. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఎయిర్పోర్టు కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే అమరావతి(Amaravati)లో పనులు ప్రారంభం అయ్యాయి. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహలు వద్దు. ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తాం. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది అని తెలిపారు.













