Nara Lokesh:టెక్ పిడుగు అఖిల్‌ను అభినందించిన మంత్రి లోకేశ్
యూకేలో విద్యను అభ్యసిస్తున్న అఖిల్ (Akhil ) చిన్న వయసు నుంచే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ (Microsoft ) ధ్రువీకరించిన అజ్యూర్, డేటా సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికెట్లు పొందాడు. యూకే నిర్వహించిన పలు టెక్ సమిట్లలో పాల్గొన్నాడు. అమరావతి (Amaravati) లో జరగనున్న సమాచార, సాంకేతికాభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో గతంలో మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్‌ను కలిశారు. టెక్నాలజీ (Technology) లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న ఆ చిన్నారిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.













