Kollu Ravindra : తప్పు చేసినవారిని చట్టం వదిలిపెట్టదు : మంత్రి కొల్లు
వైసీపీ నేత పేర్ని నాని (Nani) పాపం పండిరదని, ఇక వదిలేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్ల ప్రజలను పీక్కుతిని నేడు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. 2023లో బదిలీ అయిన తహలీల్దార్ (Tahlildar) 2024లో పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పేదలపై ప్రేముంటే 6,400 టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సీఆర్జెడ్ (CRZ) భూముల్లో పట్టాలివ్వడాన్ని కోర్టులే తప్పుబట్టాయని గుర్తు చేశారు. 2006లో బందరు పోర్టుని అమ్మేసేందుకు పేర్ని నాని ప్రయత్నించారని ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి పట్టిన అతిపెద్ద శనిగ్రహం పేర్ని నాని. సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లింది. తప్పు చేసినవారిన చట్టం వదిలిపెట్టదు. తప్పు చేసి బురద జల్లే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు. 8000 బియ్యం బస్తాలు బొక్కి బుకాయించడం హేయం. ఇళ్ల స్థలాల పేరుతో అధిక ధరలకు భూమి కొనుగోలు చేయించి కమీషన్లు దండుకున్నారు. మెడికల్ కాలేజీ (Medical College) భూ కొనుగోలులో రూ.8 కోట్ల అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక ఇచ్చింది. ప్రజల పోరాటంతో బందరు పోర్టును సాధించుకున్నాం. గత ఐదేళ్లలో బందరు పోర్టుని ఎందుకు పూర్తి చేయలేదు. 2026 నాటికి పోర్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది. బందరుని పర్యాటకం, క్రీడా కేంద్రంగా మార్చేలా చర్యలు తీసుకుంటుంది అని అన్నారు.













