Kandula Durgesh :పవన్ కల్యాణ్ చేతుల మీదుగా.. అఖండ గోదావరి ప్రాజెక్టుకు
జూన్ మొదటివారంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan ) చేతుల మీదుగా అఖండ గోదావరి ప్రాజెక్టు (Akhanda Godavari Project ) శంకుస్థాపన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి దశలో టెండర్లు పూర్తయ్యాయని, ప్రాజెక్టు రూ.97 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. 2007 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో 21 పుణ్యక్షేత్రాల వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సినిమా (Cinema) హాల్స్ బంద్ చేయడం లేదు. దీనిపై వస్తున్న పుకార్ల వెనుక స్వార్థపరుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోది. పవన్ సినిమా వస్తున్న తరుణంలో ఇలాంటి అనుమానాలు రేకెత్తించడానికి కొందరు చేస్తోన్న ప్రయత్నం ఇది. సినీ పరిశ్రమపై మాకు ఎటువంటి కక్ష లేదు. సినీ పరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబు (Chandrababu) , పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కలిసికట్టుగా వస్తే ప్రభుత్వం తరపున సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు.













