ఆస్ట్రేలియాకు మంత్రి కాకాని
ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ పట్టణంలో నీటిపారుదల వ్యవసాయ రంగాలపై నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా చేరుకున్న కాకాని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకవాత్తో మెల్బోర్న్లో భేటీ అయ్యారు. సదస్సులో చర్చకు రానున్న అంశాలు, దేశంలో అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్ ప్రణాళిక, ఆయా రంగాల్లో అంతర్జాతీయంగా సహకారంపై కొద్ది సేపు చర్చించారు. ఈ సదస్సుకు దేశంలోని అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులు, కొందరు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.













