మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు.. దేశ చరిత్రలోనే జరగలేదు
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సంద్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. 1.60 కోట్ల కుటుంబాలను సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, కలుస్తారు. నాడు-నేడు పాలనలో వ్యత్యాసాన్ని వివరిస్తారు. ఇంటింటికి స్టిక్కర్ అంటిస్తారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా ఎలాంటి పథకాలు అమలు చేయొచ్చో నిర్ణయం తీసుకుంటాం. దేశ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమం జరగలేదని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో మమేకమై సర్వే చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఐదు ప్రశ్నలతో వివరాలు సేకరించి ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తారు. ప్రభుత్వ పథకాలు నచ్చితే 82960 82960కి మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో పథకాల కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవారు. గతంలో జన్మభూమి కమిటీ అనుమతి లేనిదే పథకాలు వచ్చేవి కావు అని తెలిపారు.













