ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజు మండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, బల్లి చక్రవర్తి, ప్రభాకర్ రెడ్డి ఆయన పేరును ప్రతిపాదించారు. కాగా నవంబర్ 19న శాసనమండలి చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇతరులెవరూ నామినేషన్ దాఖలు చేయనందున మండలి చైర్మన్గా కొయ్యే మోషన్ రాజు ఎన్నికల లాంఛనం కానుంది.













