ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన .. ఆర్యవైశ్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటకం ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. సుబ్బిశెట్టి పాత్రతో ఆర్యవైశ్యుల మనోభావాలు గాయపరిచేలా నాటకం ప్రదర్శన ఉన్నట్లు సంబంధిత వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆయా వర్గాల అభ్యంతరాల నేపథ్యంలో చింతామణి నాటకం ప్రదర్శనను నిషేధిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక, సృజనాత్మక శాఖ ఉన్నతాధికారులు తదనుగుణమైన చర్యలు తీసుకోవాలంటూ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్యవైశ్యులు స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. పలువురు ఆర్యవైశ్య సంఘాల నేతలు సైతం ప్రభుత్వం నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.













