విశాఖలో అంతర్జాతీయ ఆవిష్కరణల సదస్సు
ఇంటర్నేషనల్ ఇన్నో వేషన్ ఫెయిర్ (అంతర్జాతీయ ఆవిష్కరణల సదస్సు)2017 మూడు రోజులపాటు విశాఖపట్నంలో జరగనుంది. 9, 10, 11 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 11వ తేదీన ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు. 10, 11 తేదీల్లో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ఆవిష్కరణల సదస్సును నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అసోసియేషన్లు ఈ కార్యక్రమంలో భాగమవుతున్నాయి. ప్రపంచం లోని 20 దేశాలకు చెందిన 50 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మన దేశంలో పలు రాష్ట్రాల నుంచి 80మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా సదస్సులో పాల్గొంటారు.













