వైసీపీ హయాంలో అమ్మాయిలపై.. అఘాయిత్యాలు : హోంమంత్రి అనిత
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమవేశంలో అనిత మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అన్ని అంశాలపై పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని తెలిపారు.













