మాజీ సీఎంకు 980 మందితో భద్రత అవసరమా? : హోంమంత్రి అనిత
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆమెకు వచ్చిన వినతుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీపైనే పెద్ద సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ సీఎంకు 980 మందితో భద్రత అవసరమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా, భద్రతపై రాజకీయ లబ్దికోసమే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు. జగన్ బాధితులు పులివెందుల నుంచి ప్రజా దర్బార్‌కు వస్తున్నారని ఈ సందర్భంగా అనిత వెల్లడిరచారు.













