Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ మృతి పై లోతైన విచారణ : హోంమంత్రి అనిత
పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) మృతిపై లోతైన విచారణ చేయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత (Anita) తెలిపారు. డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల కమిటీ విచారణ చేస్తోందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోందన్నారు. రాజమహేంద్రవరం (Rajahmundry) లో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి కేవలం యాక్సిడెంట్ (Accident) గా మాత్రమే పరిగణించటం లేదన్న హోం మంత్రి, ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందన్నారు. రాజీయంగా, మతపరంగా, విధ్వేషాలు రగిలేలా వ్యవహరించొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందన్నారు. ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందా? ఏమైనా ఇంటెన్షన్ ఉందా? అన్న దానిపైనా విచారణ చేస్తున్నామన్నారు. అనుమానాస్పద మృతిగానే ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశామన్నారు. ఘటనా స్థలికి సమీపంలో కాల్ డేటా (Call data) రికార్డులు కూడా తీసుకుంటున్నామన్నారు. దర్యాప్తు విషయంలో ఎవరికీ ఎలాంటి అభద్రతా భావన అవసరం లేదని తెలిపారు.













