ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా.. ఆదర్శంగా : సుచరిత
దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని ఆంధప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి సుచరిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని అన్నారు. మహిళల భద్రతపై తక్షణం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దిశ చట్టం కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు. దిశ చట్టం కింద 7 రోజుల్లోనే ఛార్జ్‌షీట్ నమోదు చేస్తున్నామని తెలిపారు. రమ్య హత్య కేసు నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేశామన్నారు. 1645 కేసులపై ఏడు రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేశామని వెల్లడించారు.
ఆసుపత్రి వద్ద లోకేష్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీఎం జగన్ మానవత్వంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయి. ఎమ్మార్వో వనజాక్షి, రిషితేశ్వరికి ఎలాంటి భద్రత కల్పించారో అందరి తెలుసు అన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు భరోసా ఏర్పడిందన్నారు. జగన్ పాలనలో దళితులు గౌరవం పొందుతున్నారని అన్నారు. గతంతో పోలిస్తే నాలుగు రెట్లు మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయి అన్నారు.













