వివేకా కేసు విషయంలో సునీత, షర్మిలకు మొట్టికాయలు వేసిన హైకోర్టు..
వైయస్ వివేకా హత్య కేసు విచారణ జరుగుతుండగా.. ఆ విషయం గురించి కోర్టు తీర్పును ప్రభావితం చేసే విధంగా మాట్లాడడం చట్టరీత్యా తప్పు. అందుకే వైయస్ వివేకా హత్య కేసు కు సంబంధించిన విషయాలను ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదని కడప కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి.. హంతకుడు ఫలానా, హత్యచేయించింది ఫలానా.. అంటూ షర్మిల, సునీత చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో కడప కోర్టు వీరిని ఆ విషయంపై మాట్లాడవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ షర్మిల, సునీత..టీడీపీ నేత బీటెక్ రవి తో కలిసి కడప కోర్టు తీర్పును ఏపీ హైకోర్టులో సవాలు చేశారు. వీరి పిటీషన్ విచారించిన తర్వాత.. పెండింగ్ లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడుతారు అని కోర్టు వారిని ప్రశ్నించింది. ఇంకా తీర్పు వెలువడని కేసు విషయంలో నిందితుడి పై హంతకుడు అని ముద్ర వేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. ఇప్పుడు వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు నేరపూరితమైన చర్యలు కిందకు వస్తాయని హెచ్చరించి.. ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని కోర్టు వారిని ప్రశ్నించింది. దీంతో ఎక్కడైనా వీళ్లు అనవసరంగా మాట్లాడకుండా ఎన్నికల ప్రచారం చేసుకుంటారేమో చూడాలి.













