ఏపీలో పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలంటూ ఓ ప్రైవేటు వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే పిటిషన్ దాఖలు చేయడం సరికాదని ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదించారు. ఎన్నికల పరిశీలన దశలోనే పిటిషన్ దాఖలు చేయడం తొందరపాటు చర్య అని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ పరంగా ఎస్ఈసీ బాధ్యత అని పిటిషన్ర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు విచారణ ముగించి, తీర్పు రిజర్వు చేసింది.













