‘అమూల్’ పై నిధులు ఖర్చు చేయకండి : ఏపీ హైకోర్టు ఆదేశం

అమూల్ కంపెనీతో కుదుర్చుకున్న ఎంవోయూపై ఎలాంటి నిధులూ ఖర్చు చేయవద్దని జగన్ ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. గుజరాత్‌లోని అమూల్ సంస్థతో పాటు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు కూడా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తమకు ఒప్పందపు పూర్తి వివరాలు ఇవ్వాలని అమూల్, డెయిరీని బోర్డును హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో జగన్ సర్కార్ చేసుకున్న ఒప్పందాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ తరపున సుప్రీం న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.
అమూల్ సంస్థకు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ మధ్ంయ ఓ ఒప్పందం కుదిరింది. ఏపీ గ్రామాల్లోని పాడి రైతుల నుంచి అమూల్ డెయిరీ పాలు కొనడం ప్రారంభించింది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డెయిరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నామని సీఎం జగన్ వెల్లడించారు.