ఏపీ మంత్రి విడుదల రజనికీ హైకోర్టు నోటీసులు
గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ జారీ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి విడుదల రజినీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి కూడా ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. పల్నాడు జిల్లా మొరకపూడిలో 91 ఎకరాల అసైన్డ్ భూమిలో తవ్వకాలకు అనుమతించడంలో మంత్రి రజని హస్తం ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ విడుదల రజనితో పాటు స్థానిక తహసీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది.













