సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశం …ఎన్నారై యశస్వి పాస్ పోర్టును
ఎన్నారై యశస్వి పాస్‌పోర్టును రిలీజ్ చేయాలని సీఐడీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారని యశస్విసై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేసి 41ఏ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో యశస్వి పాస్‌పోర్టును సీఐడీ స్వాధీనం చేసుకుంది. దీంతో తన పాస్‌పోర్టును ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో యశస్వి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం యశస్వి పాస్‌పోర్టు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.













