మద్యం పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకోవచ్చన్న కోర్టు…
ఆంధ్రప్రదేశ్లోని మద్యపాన ప్రియులకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఊరూ పేరూ తెలియని విచిత్రమైన మద్యం బ్రాండ్స్, పైగా ముట్టుకుంటే షాక్ కొట్టే ధరలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్లోని మందుబాబులకు కాసంత ఉపశమనం ఇస్తూ తన తాజా తీర్పును వెలువరించింది. వ్యక్తిగత అవసరాల నిమిత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు రాకపోకలు సాగించేవారు తమ దగ్గర మద్యం అన్య రాష్ట్రాల మద్యం బాటిల్స్ ఉంచుకోవడాన్ని అనుమతించమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.నిజానికి మద్య నిషేధం అమలవుతుంటే సరే అనుకోవచ్చు కానీ… మద్యపాన నిషేధం అమలులో లేని రాష్ట్రంలోకి స్వంత వాడకానికి కూడా నచ్చిన చోట నుంచి మద్యం తెచ్చుకోవద్దు అంటూ ఆదేశాలు జారీ చేయడంపై పలువురిలో విస్మయం వ్యక్తం అయింది.
ఈ నేపధ్యంలోనే పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చుకోవడంపై దాఖలైన పిటిషన్ను బుధవారం విచారించిన హైకోర్టు… ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తిగత అవసరాల నిమిత్తం 3 మద్యం బాటిళ్లను తెచ్చుకోవచ్చునని స్పష్టమైన తీర్పు చెప్పింది. జీవో నెంబరు 411 ప్రకారం 3 బాటిళ్లు తెచ్చుకోవచ్చునన్న పిటిషన్పై ఈ తీర్పుని ఇస్తున్నట్టు తెలిపింది.













