ఎన్ఆర్ఐ యశస్వికి హైకోర్టులో ఊరట
ఎన్ఆర్ఐ యశస్వి కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఊరట లభించింది. తనపై సీఐడీ ఇచ్చిన లుక్ ఔట్ నోటీసును ఎత్తివేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్‌ను ఇప్పటికే సీఐడీ అరెస్టు చేసి 41ఏ నోటీసు ఇచ్చిందని న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు. అరెస్టు చేసిన 41ఏ నోటీసు ఇచ్చిన తర్వాత లుక్ ఔట్ నోటీసు కొనసాగించటం ఆర్టికల్ 21కి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నోటీసు కారణంగా విదేశాలకు వెళ్లాలంటే పిటిషనర్‌కు ఇబ్బందులుంటాయని, కొట్టివేయాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం సీఐడీ జారీ చేసిన లుక్ ఔట్ నోటీసును రద్దు చేస్తూ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.







