High Court: వైసీపీ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) లో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ (YCP) దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) కొట్టివేసింది. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రీ పోలింగ్ అంశంపై ఈసీ (EC) నిర్ణయం తీసుకుంటుందని, ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభావం ఎదురైంది.