Kakani :హైకోర్టులో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఎదురుదెబ్బ!
వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్వార్జ్ తవ్వకాలపై పొదలకూరు (Podalakur)లో నమోదైన కేసుకు సంబంధించి అరెస్ట్ విషయంలో తొందరపడ కుండా పోలీసులను ఆదేశించాలని, పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని కాకాణి వేసిన పిటిషన్‌ను హైకోర్టు (High Court) కొట్టివేసింది. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసు స్టేషన్లో ఫిబ్రవరిలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని చేర్చారు. అనంతరం విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు (Notices) జారీ చేయగా, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసిన పోలీసులు, హైదరాబాద్ (Hyderabad), చెన్నై, బెంగళూరులో ఆయన కోసం గాలిస్తున్నారు.













