ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడంపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో ప్రైవేట్ యాజమాన్యాల తరపున తల్లుల ఖాతాలో నిధుల జమపై కృష్ణదేవరాయ వర్సిటీ అసోసియేషన్ సవాల్ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డివిజనల్ బెంచ్‌లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. యాజమాన్యాల తరపున ముతుకుమిల్లి శ్రీవిజయ్, సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్ని అనంతరం న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.













