ఏపీ ప్రభుత్వానికి షాక్…పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పరిషత్ ఎన్నికల పక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ నెల 1న ఎస్ఈసీ జారీచేసిన నోటిఫికేషన్లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు 4 వారాలల సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల పక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.













