పీఏసీ చైర్మన్ పయ్యావులకు… ఏపీ ప్రభుత్వం షాక్
తెలుగుదేశం పార్టీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుంది. ఆయన వద్ద పని చేస్తున్న గన్మెన్లు వెనక్కి రావాలని ఆదేశించింది. నిన్నటి వరకు ఆయనకు 1G1 భద్రత ఉండేది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చాకే ఆయనకు భద్రతను తొలగించారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది. తనకు సెక్యూరిటీ పెంచాలని కొద్దిరోజుల క్రితమే పయ్యావుల ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ క్రమంలో ఆయనకు భద్రతను తొలగించడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు.













