గన్ మెన్లను వెనక్కి పంపిన పవన్
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన గన్మెన్లను వెనక్కిం పంపారు. నెలరోజుల క్రితమే పవన్, తనకు భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పవన్‌కు నలుగురు గన్మెన్లను కేటాయించింది. రెండు షిప్టుల్లో ఇద్దరు గన్మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు. అయితే మంగళవారం రాత్రి పవన్ తన గన్మెన్లను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. పార్టీ వ్యవహారాలు చేరవేసేందుకు ప్రభుత్వం గన్మెన్లను వాడుకుంటోందని జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకోసమే వారికి వెనక్కు పంపినట్లు తెలుస్తోంది. గన్మెన్లను వెనక్కి పంపడంపై పవన్ కల్యాణ్ కారణాలను వెల్లడించలేదు.













