ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లా వాసుల చిరకాల స్వప్పమైన స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్దనందులూరు పంచాయతీల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిది. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వంద శాతం పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్లో రూ.250 కోట్లను కేటాయించారు. ఇబ్రహీంపట్నంలోని ఇన్‌క్యాప్ కార్యాలయాన్ని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ రిజిస్టర్ కార్యాలయంగా పేర్కొన్న ప్రభుత్వం..పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, గనుల శాఖ కార్యదర్శి కె.రామ్ గోపాల్‌ను డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.













