రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,000 వేశాం: సీఎం చంద్రబాబు
డబ్బు తీసుకోడానికి రైతులకు ఇబ్బంది లేదు. ‘అన్నదాత సుఖీభవ’ ను రైతులంతా స్వాగతిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో హర్షాతిరేకాలు. ‘పసుపు-కుంకుమ’ను మించిన అన్నదాతల ప్రజాదరణ. ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో ఎడ్లబండ్ల ర్యాలీలు. నవధాన్యాలతో, పండ్లతో ఎడ్లబండ్ల అలంకరణలు. రైతుల్లో సంతోషం రాష్ట్రానికి సుభిక్షం. ఈ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఏపిలో రైతులకు చేసినంతగా దేశంలో ఎక్కడా జరగలేదు. రూ.24వేల కోట్ల రుణమాఫీ, విపత్తు సాయం పెంపు. కౌలురైతులకు రూ.15వేల పెట్టుబడి సాయం,9గం విద్యుత్ సరఫరా. మన రాష్ట్రంలో రైతులకు ఎన్నో వినూత్న పథకాలు తెచ్చాం. సమర్ధ నీటి నిర్వహణతో దిగుబడులు పెరిగాయి. భూగర్భ జలాల పెంపులో కర్నూలు,అనంతపురం దేశంలోనే టాప్. 95లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.20వేలు. 74లక్షల రైతుకుటుంబాలకు రూ.15వేలు పెట్టుబడి సాయం. 60లక్షల మందికి పెన్షన్లు 10రెట్లు చేశాం. పేదల సంక్షేమానికి ఏపి ఒక నమూనా. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసాకు ప్రజల్లో బ్రహ్మరథం.













