ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తొలగింపు
ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం ఉన్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జయరాంను తొలగిస్తున్నట్టు సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా టీడీపీ హయాంలో అమెరికా వ్యవహారాల్లో కోమటి జయరాం కీలకంగా వ్యవహరించారు. ఏపీ ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, నేతలు అమెరికాకు వచ్చినా.. తెలుగువారికి సంబంధించిన సభలు ఏమైనా జరిగినా వీటన్నింటినీ జయరామే దగ్గరుండి చూసుకునే వారు. అయితే ఆయన స్థానంలో వైసీపీ ప్రభుత్వం ఎవర్ని నియమిస్తుంది. ఈ పదవి ఎవర్ని వరించనుంది? అనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.













