Dwcra: డ్వాక్రా మహిళల ఆర్థిక ఎదుగుదలకు కొత్త బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh State Government) తాజాగా డ్వాక్రా మహిళల (DWCRA Women) కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించింది. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, వ్యాపార రంగంలో ముందుకు రావాలి అన్న లక్ష్యంతోనే ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు వారి కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకునే అవకాశాలు పెరుగనున్నాయి.
ముఖ్యంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో (25 Districts) త్వరలో పెట్రోల్ బంకులు (Petrol Bunks) ప్రారంభం కానున్నాయి. ఇవి మహిళా సంఘాల (Women Associations) ఆధ్వర్యంలో నడపబడేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది మొదటిసారిగా రాష్ట్రంలో అమలవుతున్న వ్యవహారం కావడంతో మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది. పెట్రోల్ బంకులను నడిపే బాధ్యత మహిళలకు ఇచ్చి వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఈ విధంగా మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశాన్ని వినియోగించుకొని వ్యాపారంలో స్థిరపడేందుకు పునాది వేసుకోవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో వారు తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చు. దీనికితోడు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అవసరమైన స్థలాల విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. ప్రతి డ్వాక్రా సంఘానికి రూ. లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. అలాగే మెప్మా స్వయం సహాయక సంఘాలకు (MEPMA Self-Help Groups) కూడా రూ. 6000 కోట్ల పొదుపు నిధులను వినియోగించి మహిళల కోసం వ్యాపార అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెట్టి ముందుకు సాగాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారు.
దీనితో పాటు డ్వాక్రా మహిళలకు వాహనాలు అద్దెకు అందించేందుకు రాపిడో సంస్థ (Rapido Company)తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనివల్ల మహిళలు అవసరానికి అనుగుణంగా వాహనాలను అద్దెకు తీసుకుని తమ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. తాజాగా ఆంధ్ర ముఖ్యమంత్రి ( AP Chief Minister)చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మహిళల కోసం వాహనాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అంతేకాకుండా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెల్డింగ్ మార్కెట్లు (Smart Street Vending Markets) ఏర్పాటుచేసే పనిలో కూడా ప్రభుత్వం తలపడుతోంది. ఇవి మహిళలకు మరో ఉపాధి మార్గంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ చర్యలు మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంపొందించే దిశగా కీలకంగా నిలవనున్నాయి.













